పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి “కీర్తి పురస్కారం” (ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ చంద్రబోస్ గారి చేతుల మీదుగా)

సుప్రసిద్ధ   కవయిత్రి, రచయిత్రి అల్లూరి గౌరీలక్ష్మి గారికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2017 సంవత్సరానికి కీర్తి పురస్కారం లభించింది. తెలుగు సాహిత్యంలోని  వివిధ రంగాల్లో విశేష సేవలందించిన  43  మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం  2017 సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రదానం చేసింది.

ఏ పీ ఐ ఐ సి లో జనరల్ మేనేజర్ గా,(  Andhra Pradesh Industrial Infrastructure Corporation )  పని చేస్తున్నఅల్లూరి గౌరీలక్ష్మి వివిధ ప్రక్రియలు విభాగంలో “ కీర్తి “ పురస్కారం అందుకున్నారు. అక్టోబర్ 26 న హైదరాబాద్ నాంపల్లి లో గల ఎన్టీఆర్ ఆడిటోరియంలో తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ అలేఖ్య పుంజల, వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ వీ సత్యనారాయణ, సినీ గేయ రచయిత చంద్ర బోస్ ల చేతుల మీదుగా గౌరీ లక్ష్మి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి  అనేక కధలు, నవలలు, కవిత్వం, కాలమ్స్,  ఆర్టికల్స్ మరియు రాజకీయ వ్యంగ్య వ్యాసాలు రాశారు. ఈమె 26 సంవత్సరాలుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలో అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూనే నిరంతరాయంగా సాహితీ కృషి చేస్తున్నారు. ఈమె  ఈ సంవత్సరం 2018 మార్చి నెలలో  ” శ్రీ విళంబి ” ఉగాది సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ  నారా చంద్ర బాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్నారు. ఈమె స్వస్థలం అంతర్వేది పాలెం, విద్యాభ్యాసం మలికిపురం డిగ్రీ కాలేజీ , తూర్పు గోదావరి జిల్లా.

 

APIIC GM Tells women to join health campaign

A Gouri Lakshmi Interview Andhra-Jyothi,-dt.-25.04.2018

A Gouri Lakshmi Interview Prajasakti Paper

Hans India 22.03.2018 Gouri Madam Interview