సుప్రసిద్ధ కథా,నవలా రచయిత్రి, కవయిత్రి,కాలమిస్ట్ శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి.
గోదావరి నదీపాయల మధ్య కోనసీమలో అంతర్వేది సముద్రానికి దగ్గరగా ఉండే అంతర్వేదిపాలెం గ్రామంలో జన్మించి కొబ్బరి,మావిడి తోటల మధ్య నేస్తాలతో కోతి కొమ్మచ్చి ఆడుతూ, కాలవలో ఈతలు కొట్టిన గౌరి గారికి ప్రకృతి అంటే గొప్ప ఆరాధన. మానవ జీవితంలో చివరికి మిగిలేవి రెండే అవి స్నేహం,ప్రేమ అని మనసా, వాచా నమ్మే ఈమె తండ్రి కీ.శే.అల్లూరి లక్ష్మీపతిరాజు గారు.తల్లి కీ.శే.శ్రీమతి ఎ.నరసమ్మ గారు. ఈమెకు మాతృసమానులైన అక్కయ్యలు ముగ్గురు. కీ.శే.వెంకటనరసమ్మ, శ్రీమతి సరస్వతి, శ్రీమతి సూర్యకాంతం గార్లు. తండ్రిలా పెంచిన బావగారు శ్రీ దండు విశ్వనాధరాజు గారు. ఏకైక సోదరుడు శ్రీ అల్లూరి సూర్యనారాయణరాజు గారు, వదినమ్మ శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గారు.
విద్యాభ్యాసం:4వ తరగతి ఒక ఆశ్రమ పాఠశాల, రాజమండ్రి, 5,6,7 తరగతులు ఓరియంటల్ హైస్కూల్ (సంస్కృత పాఠశాల),సీతంపేట,రాజమండ్రి టౌన్. 8వ తరగతి మలికిపురం,E.G.Dt., తెలుగు హైస్కూల్ నుంగంబాకం,మద్రాస్, గాజువాక హైస్కూల్, వైజాగ్. 9వ తరగతి మోగల్లు,కోపల్లె హైస్కూల్స్,10వ తరగతి ఉండి హైస్కూల్, W.G.Dt. Inter,B.Sc మలికిపురం డిగ్రీ కాలేజ్, EG Dt.. MA(Political Sci.) & BPR, అంబేద్కర్ యూనివర్సిటీ,హైదరాబాద్.
ఈమె ఆంధ్ర ప్రదేశ్ హస్తకళల సంస్థ (APHDC)లో 1984లో చేరి 2 ½ సం.లు పనిచేసి రిజైన్ చేసి, పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC)లో 1986 లో చేరి, 33 సం.లు పనిచేసి పబ్లిక్ రిలేషన్స్ జనరల్ మేనేజర్ గా 2019 లో పదవీ విరమణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతోద్యోగినిగా విధుల్ని నిర్వహిస్తూనే ప్రముఖ రచయిత్రిగా తనను తాను నిరూపించుకున్నారు. 1992 లో మొదలు పెట్టి, గౌరీలక్ష్మి గారు గత 30 సంవత్సరాలుగా సాహితీ సేద్యం చేస్తూ,నవలా రచయిత్రిగా, కథా రచయిత్రిగా, కవయిత్రిగా, కాలమిస్ట్ గా చక్కని పేరు తెచ్చుకున్నారు. అనేక పొలిటికల్ సెటైర్ లు కూడా రాశారు. ఈమె రాసిన అనేక కధలకు,కవితలకు బహుమతులు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శ్రీ విళంబి ఉగాది ( 18.3.18) నాడు, అప్పటి గౌరవ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా “ఉగాది పురస్కారం” అందుకున్నారు. అక్టోబర్,2018 లో పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ,హైదరాబాద్ నుండి “కీర్తి” పురస్కారం, ఇంకా లేఖిని సంస్థనుండి “లేఖిని” పురస్కారం అందుకున్నారు. మరికొన్ని మ్యాగజైన్ ల వారు ఇచ్చిన సాహితీ సేవా పురస్కారాలు కూడా పొందారు.
ఫామిలీ :జీవన సహచరుడు శ్రీ పెన్మెత్స సుబ్రమణ్య గోపాలరాజుగారు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో పనిచేసి పదవీ విరమణ పొందారు.కుమార్తె కాంతిరేఖ,కోడలు శ్రావణి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు.అల్లుడు శ్రీ నడింపల్లి రఘుకిరణ్,Asst.Prof.,VITS,Chennai, కుమారుడు శ్రీ పెన్మెత్స ఫణిచంద్రవర్మ,Manager, International Airport,Bangalore. మనుమలు చిరంజీవులు సాయి వివేక్ వర్మ,శ్రీ ప్రణవ్ వర్మ, బుజ్జాయి సాయిశుభ.
“ప్రకృతి ఆరాధనా, సంగీతాస్వాదనా వ్యసనాలుగా జీవిక సాగించాలని మనసు కోరిక.కానీ లోక రీతినీ, గతినీ, మానవ నైజాలనీ గమనిస్తూ, నాతో పాటు జీవన వాహినిలో సాగుతున్న తోటి మనుషుల మధ్య ఘర్షణను చూస్తూ, మనం ఇంతకన్నా బాగా, ప్రశాంతంగా బతకలేమా ? అందుకోసం ఆలోచించలేమా ? అనుకున్నప్పుడు తోటి వారికి ఏదో చెప్పాలన్న తపన, ఉద్వేగం నన్ను రాయిస్తాయి. మానవ సంబంధాల కోణంలో నవల,కథ,కవిత, కాలమ్ ఇలా పలు ప్రక్రియల ద్వారా రాల్చిన చిటపట రవ్వలే నా రాతలు” అంటూ ఈమె తన సున్నిత హృదయాన్ని పది పుస్తకాల రూపంలో మనముందుంచారు.
News Media
- My interview in Hans India News Paper
- Interview by Hans India
- Write up in Andhrajyothi Daily,Vijayawada
- A Gouri Lakshmi Interview Prajasakti Papers
- My Interview in Sakshi Daily on 26.6.2022