Dr. Trinadha Rudraraju
Dr. Trinadha Rudraraju
----

Gouri Lakshmi has inherited talent with an ecosystem and learned from her Good Teachers. A variety of circumstances, I feel, contributed to her becoming a Brilliant Writer. Her kind and just nature gained her praise at work as well as admiration from Friends and Family.

బలభద్రపాత్రుని మధు, టీవీ సీరియల్స్ పాటల రచయిత, నంది అవార్డు గ్రహీత
బలభద్రపాత్రుని మధు, టీవీ సీరియల్స్ పాటల రచయిత, నంది అవార్డు గ్రహీత
----

అల్లూరి వల్లరి APIIC లో, నా సహోద్యోగిని.మా స్నేహం మూడు దశాబ్దాలది.నేను ఆమె అభిమానిని.ఈ నాటి ఒత్తిడి జీవితంలో కూడా నిరంతరం చిరునవ్వు మేళవించి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్నేహశీలి,నిగర్వి.బహు ప్రక్రియల్లో చేసిన రచనల్లో కూడా హాస్యం, వ్యంగ్యం, సూటిగా, స్పష్టంగా,మనసుని తట్టి చెప్పడం ఆమె ప్రత్యేకత. గౌరీలక్ష్మి నుంచి మరిన్ని రచనలు ఆశిస్తున్నాను.

శ్రీ విహారి గారు, సుప్రసిద్ధ సీనియర్ కవి,కథకులు, నవలారచయిత,కాలమిస్ట్,విమర్శకులు
శ్రీ విహారి గారు, సుప్రసిద్ధ సీనియర్ కవి,కథకులు, నవలారచయిత,కాలమిస్ట్,విమర్శకులు
----

గౌరీలక్ష్మి విద్వన్మణి,సాహితీమూర్తి.స్పష్టత,సరళత ఈమె రచనల్లోని విశిష్టత. గౌరీలక్ష్మికి దోసెడు అభినందనలు,బుట్టెడు శుభాకాంక్షలు.

సృజనధుని, డా.సి.భవానీదేవి
సృజనధుని, డా.సి.భవానీదేవి
----

ఈమె రాష్ట్ర ప్రభుత్వోద్యోగినిగా పనిచేస్తూనే ముప్పై సంవత్సరాలుగా సాహితీసేద్యం చేస్తూ ఉపయుక్త ఫలాలను వివిధప్రక్రియల్లో అందిస్తున్నది. సంస్కారవ్యక్తిత్వాన్ని ఉత్తమస్థాయిలోకలిగి ఉన్నగౌరి అంకిత భావం గల అక్షర తపస్విని.ఈ స్నేహబాంధవికి అభినందన.

ఆత్మీయ గురువు గారు శ్రీ శ్రీరామారావు గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్,మలికిపురం డిగ్రీ కాలేజ్
ఆత్మీయ గురువు గారు శ్రీ శ్రీరామారావు గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్,మలికిపురం డిగ్రీ కాలేజ్
----

గౌరీలక్ష్మి గారి కథాక్షరం- కరదీపిక,కవితాక్షరం- భావాల చెండు,వ్యాసాక్షరం- వస్తువివరణం,
వ్యంగ్యాక్షరం- తూణీరం, నవలాక్షరం-అనుభవప్రవాహం!
శుభాశీస్సులతో

అభినందనలతో, మందరపు హైమవతి,ప్రముఖ స్త్రీవాద కవయిత్రి,విజయవాడ.
అభినందనలతో, మందరపు హైమవతి,ప్రముఖ స్త్రీవాద కవయిత్రి,విజయవాడ.
----

ఈమె రచనలన్నీసామాజిక చైతన్యంతో తొణికిసలాడుతుంటాయి. స్నేహ స్వభావి,సౌమ్యులు,నిరాడంబరులు.చెరగని చిరునవ్వుతో అందరినీ పలకరిస్తారు.

చదివించే గుణం వీరి రచనల ప్రత్యేకత.

తెలకపల్లి రవి,ఎడిటర్,రచయిత, కాలమిస్ట్,రాజకీయ విశ్లేషకులు
తెలకపల్లి రవి,ఎడిటర్,రచయిత, కాలమిస్ట్,రాజకీయ విశ్లేషకులు
----

జీవిత వాస్తవాలు,మానవ స్వభావాలలో వైరుధ్యాలు,మహిళల మనోవేదనలు,సమాజంలో సంఘర్షణలు బాగా తెలిసిన రచయిత్రి.దీర్ఘకాలం రాష్ట్రప్రభుత్వాధికార
బాధ్యతలు నిర్వహించిన ఈమె అక్షరాన్ని అభివ్యక్తి సాధనంగా మలుచుకున్న తీరు అభినందనీయం.రచనల్లోనూ,మాటల్లోనూ హాస్యం,వ్యంగ్యం ముళ్ళపూడి తరహా ఆర్ద్రత ఉంటాయి.

హైమాభార్గవ్, ప్రముఖ కథా,నవలా రచయిత్రి,కాలమిస్ట్,బెంగుళూరు.
హైమాభార్గవ్, ప్రముఖ కథా,నవలా రచయిత్రి,కాలమిస్ట్,బెంగుళూరు.
----

గౌరి నాకు మంచి మిత్రురాలు.మంచితనం,మానవత్వం,జాలి,కరుణ, నవ్వు,దుఃఖం,వ్యంగ్యం ఇలా అన్ని రంగులూ ఆమె రచనల్లో కనబడతాయి.అలవోకగా చదివించే శైలితో లోకం పోకడ చక్కగా చిత్రిస్తుంది.

కస్తూరిమురళీకృష్ణ, సాహితీసవ్యసాచి
కస్తూరిమురళీకృష్ణ, సాహితీసవ్యసాచి
----

గౌరీలక్ష్మిగారు సహృదయులు.వివాదాలకు దూరంగా ఉండే సమన్వయవాది.కథ,కవిత,నవల,వ్యాసం
రచన ఏదైనా మానవ మనస్తత్వంలోని వైచిత్రిని ప్రదర్శిస్తారు.ఆమె రచనలు సున్నితమూ,ప్రశంసనీయమూనూ.
వారు మరిన్నిఅవార్డులు అందుకోవాలని ఆశిస్తూ.

గోటేటి లలితాశేఖర్, ప్రముఖ,కథారచయిత్రి,గుంటూరు
గోటేటి లలితాశేఖర్, ప్రముఖ,కథారచయిత్రి,గుంటూరు
----

గౌరి గారు మున్ముందు మంచి మనిషి.ఆమెలో ఉండే తపన,పట్టుదల, పరిశీలన,అవగాహన బహుముఖీనంగా ఎదగడానికి దోహద పడ్డాయి.ఆమె లక్ష్యం ఆమెను బాధ్యతలను సమర్ధవంతంగా నడిపిన ప్రభుత్వాధికారిని చేస్తే,ఆలోచన, అభివ్యక్తి ఆమెను మంచి రచయితను చేసింది.అన్నిటికీ మించి ప్రేమను పంచే తల్లిగా,భార్యగా, స్నేహితగా ఆమె గౌరీలక్ష్మీ సరస్వతి.శుభాభినందనలు.

ప్రముఖ కవయిత్రి, శ్రీమతి ఎస్.కాసింబి,గుంటూరు
ప్రముఖ కవయిత్రి, శ్రీమతి ఎస్.కాసింబి,గుంటూరు
----

గౌరీలక్ష్మి కథా,నవలా రచయిత్రిగా,కవయిత్రిగా, సమీక్షకురాలిగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన స్నేహమయి.ఇంకా కాలమిస్టుగా కొత్త కోణాలు చూపిస్తూ, సుతిమెత్తని చురకలు వెయ్యడం వీరి ప్రత్యేకత.స్వచ్ఛమైన నవ్వు,ఆత్మీయత నిండిన పలకరింపు,సున్నిత స్వభావం,సునిశిత పరిశీలన,మనసునాకర్షించే మాట తీరు వీరి వ్యక్తిత్వానికి పెట్టని ఆభరణాలు.

సారస్వత కళానిధి,  డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి
సారస్వత కళానిధి, డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి
----

గౌరీలక్ష్మి స్మితహితమృదుభాషిణి. తన అంతరంగంలోని మార్దవం,స్నేహశీలత ఆమె రచనల్లో ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తాయి.వ్యంగ్య, హాస్య ధోరణిలో  ‘ సంచిక ‘ అంతర్జాల పత్రిక  లో గౌరీలక్ష్మి, ప్రతి నెలా రాస్తున్న “రంగులహేల” కాలమ్స్ ఆలోచనాత్మకాలు.వీరి కలం నుండి ప్రయోజనాత్మక రచనలు ఇతోధికంగా వెలువడాలని మనః పూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.

G.S.LAKSHMI, ప్రముఖ కథా రచయిత్రి,కాలమిస్ట్.
G.S.LAKSHMI, ప్రముఖ కథా రచయిత్రి,కాలమిస్ట్.
----

పేరులో లక్ష్మీ పార్వతులని పెట్టుకుని మనసునిండా చదువులతల్లిని ప్రతిష్టించుకున్న పేరెన్నికగన్న రచయిత్రి గౌరీలక్ష్మి.మూడు దశాబ్దాలుగా సాహితీ రంగంలో నవలా,కథా,కవితలే కాక మంచి కాలమిస్ట్ గా కూడా కృషి చేస్తున్నారు.చెప్పదలుచుకున్నది సూటిగా,స్పష్టంగా చెప్తారు.ఉన్నత విద్య నభ్యసించి, హోదాగల ఉద్యోగం చేసినా నిరంతర నిశిత సమాజ పరిశీలనాదృష్టి ఆమెది.రాజకీయ,వ్యంగ్య చిత్రణలో సిద్ధహస్తురాలు.ఈమె నాకు మంచి మిత్రురాలు అవడం నా అదృష్టం అనుకుంటాను.

డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, ప్రముఖ కవయిత్రి,కధా రచయిత్రి,కాలమిస్టు, కాకినాడ
డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, ప్రముఖ కవయిత్రి,కధా రచయిత్రి,కాలమిస్టు, కాకినాడ
----

అల్లూరి గౌరీలక్ష్మి మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకి వారసులు.ఐతే ఈమె విప్లవం విద్యారంగంలో చేశారు.ఆడపిల్లగా చదువుకునే అవకాశం ఇవ్వని సామాజిక వర్గం నుంచి వచ్చి పెద్ద చదువులు,పెద్ద ఉద్యోగాలతో కొత్త శకం మొదలు పెట్టారు.అక్కడితో ఆగక సాహిత్యంలో నవల,కథ,కాలమ్, కవిత్వాల ద్వారా సామాజిక రుగ్మతలను నలుగురికి ఎత్తి చూపుతూ ముందుకు సాగుతున్నారు.ఇంట గెలిచిన గౌరి పాఠకుల హృదయాలను గెలవడమే కాక మంచి స్నేహితుల హృదయాలను కూడా గెలిచిన స్నేహమయి.

ఇంద్రగంటి జానకీబాల,ప్రముఖ కథా, నవలా రచయిత్రి,కవయిత్రి
ఇంద్రగంటి జానకీబాల,ప్రముఖ కథా, నవలా రచయిత్రి,కవయిత్రి
----

చిరునవ్వుల సిరి
స్నేహ భావాలతో కదిలే జాజి పూలఝరి
ప్రేమంటే గౌరి
లక్ష్మి సరే సరి.

ఇంద్రగంటి జానకీబాల,
ప్రముఖ కథా, నవలా రచయిత్రి,కవయిత్రి

ముత్యాలముగ్గు సంగీత, సినిమా హీరోయిన్
ముత్యాలముగ్గు సంగీత, సినిమా హీరోయిన్
----

లక్ష్మి కళతో, చిరునవ్వుల పలకరింపులతో గౌరీలక్ష్మి గారు నాకు ఆత్మీయ మిత్రులయ్యారు.వీరి కథలూ,కవితలూ, కాలమ్స్ చాలా కొత్తదనంతో ఉండి ఈ తరానికీ పాత తరానికీ అనుబంధంగా ఉంటాయి.వీరి రచనలు సమాజంలోని అన్నిరకాల ప్రజల ఆవేదన, ఆప్యాయత,అనురాగాల సమ్మేళనంగా నాకు కనిపించాయి. రచనల్లో డైలాగ్స్ సూపర్ గా ఉంటాయి. అంతే కాక వీరి మాటల్లో కూడా ఎంతో ఆప్యాయత ఉంటుంది. ఈమె ఇంకా అనేక రచనలు చేసి మరిన్ని పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆశిస్తున్నాను.

ముత్యాలముగ్గు సంగీత, సినిమా హీరోయిన్

పుట్టి నాగలక్ష్మి,Eminent, Philatelist..Retd.HM.Gudivada
పుట్టి నాగలక్ష్మి,Eminent, Philatelist..Retd.HM.Gudivada
----

గ్రామీణ నేపథ్యం నుండి… నగర జీవితానికి తరలి…ఉద్యోగ జీవితంలో ప్రజాసంబంధాల అధికారిణిగా రాణించారామె.కవితలు, కథలు, కాలమ్స్, నవలలు వ్రాశారు. మధ్యతరగతి ప్రజల జీవన వైరుధ్యానికి ప్రాముఖ్యత ఇచ్చినా… అవసరమైనపుడు క్రింద తరగతి, ఉన్నత తరగతుల పాత్రలను సృష్టించి జీవం పోశారు…కవితలు, కాలమ్స్ విలక్షణశైలితో…ఆమె మనతో కబుర్లు చెబుతున్నట్లుగా ఉంటాయి. సుందర సరళ తెలుంగు ఈమె సొత్తు.ఈమె రచనలు ఆసాంతం మానవీయ కోణం,మానసిక విశ్లేషణ, సమస్యా పరిష్కార సూచనలు, పాజిటివ్ దృక్కోణం,సుఖదుఃఖాలు,కష్ట నష్టాలు అన్నీ హాస్యాన్ని మేళవించి, మెరిపించి,మురిపించి ,చురుక్కుమనిపిస్తాయి.ఆమె మానవతావాది, స్నేహమయి,అనురాగమయి, ప్రకృతి ప్రేమికురాలు,కళాభిమాని, ఆపద్సమయాలలో అక్కున చేర్చుకునే నెచ్చెలి… ఆమే కోనసీమ లోని అంతర్వేదిపాలెంలో గోదారొడ్డున పల్లవించిన శ్రీమతి అల్లూరి (పెన్మెత్స) గౌరీ లక్ష్మి… వారికి మనహ్పూర్వక అభినందనలు… పుట్టి నాగలక్ష్మి.

డాక్టర్ శైలజ,కవయిత్రి
డాక్టర్ శైలజ,కవయిత్రి
----

ప్రింట్ మీడియా,వెబ్ మేగజైన్ ఎక్కడైనా అల్లూరి గౌరీలక్ష్మి గారి రచనలు చూడగానే ముందు చదివేయాలనిపించేంత ఉత్సాహం గా ఉంటుంది.దీనికి కారణం సంభాషణ లో మాత్రమే సాధ్యమయే జీవచైతన్యం రచనల్లో తొణికిసలాడే ప్రత్యేకత.వ్యాసం,కథ,కాలమ్ కథ ఏ ప్రక్రియ ఐనా సరే చదివాక చాలా సేపు గుండెల్లో నిండే ఒక పాజిటివ్ వైబ్రేషన్.

శీలా సుభద్రాదేవి,ప్రముఖ కవయిత్రి..నవలా కధా రచయిత్రి
శీలా సుభద్రాదేవి,ప్రముఖ కవయిత్రి..నవలా కధా రచయిత్రి
----

అల్లూరి గౌరిలక్ష్మి గత మూడు దశాబ్దాలుగా గా కథలు, కవితలే కాక పత్రికల్లో కాలం కూడా నిర్వహించారు. ఏది రాసినా విద్యావంతులు, ఉద్యోగినులు అయిన ఆధునిక మహిళల ఆలోచనలకూ దృక్పథంకు అద్దం పట్టేలా వీరి పాత్రలు ఉంటాయి.ఏ అంశం తీసుకున్నా సరళసుందరమైన శైలి తో ఉంటాయి గౌరిలక్ష్మి రచనలు.స్నేహసౌజన్యశీలి అయినందున గౌరిలక్ష్మి తనరచనల్లో కౌటుంబిక విలువలూ మానవీయసంబంధాలకూ పెద్దపీట వేస్తూ సానుకూల ప్రతిస్పందన తో ఒకింత హాస్యస్పోరకంగా ఆహ్లాదకరంగా మనసుకు హత్తుకునేలా రాయటం వీరి రచనా విధానం.అల్లూరి గౌరిలక్ష్మి గారికి మనఃపూర్వక అభినందనలతో శీలా సుభద్రాదేవి

గోళ్ల నారాయణ రావు,విజయవాడ
గోళ్ల నారాయణ రావు,విజయవాడ
----

ఏ విషయం మీద అయినా, ఏ సాహిత్య ప్రక్రియలో అయినా, అద్భుతమైన అవగాహనతో, అబ్బురపరిచే అక్షరవిన్యాసం చేస్తున్న శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారి కలంకారీ మరింత విస్తారమైన వేదికపై అడుగు పెడుతున్న సందర్భంలో, మరెంతో మంది అభిమానులను ప్రోగుచేసే, మరిన్ని రచనల కోసం ఎదురుచూస్తున్నాను.

గుత్తికొండ సుబ్బారావు.మచిలీపట్నం
గుత్తికొండ సుబ్బారావు.మచిలీపట్నం
----

స్నేహమయి అల్లూరి గౌరీలక్ష్మి ఒక పెద్ద ప్రభుత్వ సంస్థలో పెద్ద ఆఫీసర్ గా పదవీవిరమణ చేశారు… ఉద్యోగంలో వున్నప్పుడూ, రిటైర్ అయినాకా కలుస్తూనేవున్నాం. హితుల యెడ ఆమె కనబరిచే ఆప్యాయత, శ్రద్ధ ల్లో ఏమాత్రం మార్పు లేదు. ఆమె రచనల విషయానికొస్తే ఎక్కువగా సామాజిక స్పృహ, ఒకింత వ్యంగ్యం కన్పిస్తాయి. అనవసరమైన కల్పితాలకు, వర్ణనలకు పోరు. సూటిగా, ధాటిగా సాగుతాయి కథనమైనా, కవితయినా. -గుత్తికొండ సుబ్బారావు.

అడుసుమిల్లి మల్లికార్జున..బాపట్ల
అడుసుమిల్లి మల్లికార్జున..బాపట్ల
----

నాకు శైలి,శిల్పం తెలీదు.. కవిత్వం అంతకంటే తెలీదు,అంటారు గౌరీ లక్ష్మి గారు.అందువల్లనేమో ఉత్తమ సాహిత్యం రాయగలిగారు.నవల,కథ,కవిత,గల్పిక…అన్ని ప్రక్రియలు ఆమె కలంతో అందాన్ని సంతరించుకున్నాయి.నలుగురు మిత్రులు,నాలుగు పుస్తకాలు ఉంటే చాలు జీవితానికి అనే ఈమెను ఎవరితోనూ పోల్చటానికి వీలు లేదు.ఒకవేళ పోలిక తెస్తే “బీనా దేవి”గారే అగుపిస్తారు,కాసింత తక్కువా కావచ్చు,కూసింత ఎక్కువా కావచ్చు.సమాజానికి,సాహిత్యానికి
అవసరమైన కలం.. గౌరీ లక్ష్మీ గారు.