గ్రామీణ నేపథ్యం నుండి… నగర జీవితానికి తరలి…ఉద్యోగ జీవితంలో ప్రజాసంబంధాల అధికారిణిగా రాణించారామె.కవితలు, కథలు, కాలమ్స్, నవలలు వ్రాశారు. మధ్యతరగతి ప్రజల జీవన వైరుధ్యానికి ప్రాముఖ్యత ఇచ్చినా… అవసరమైనపుడు క్రింద తరగతి, ఉన్నత తరగతుల పాత్రలను సృష్టించి జీవం పోశారు…కవితలు, కాలమ్స్ విలక్షణశైలితో…ఆమె మనతో కబుర్లు చెబుతున్నట్లుగా ఉంటాయి. సుందర సరళ తెలుంగు ఈమె సొత్తు.ఈమె రచనలు ఆసాంతం మానవీయ కోణం,మానసిక విశ్లేషణ, సమస్యా పరిష్కార సూచనలు, పాజిటివ్ దృక్కోణం,సుఖదుఃఖాలు,కష్ట నష్టాలు అన్నీ హాస్యాన్ని మేళవించి, మెరిపించి,మురిపించి ,చురుక్కుమనిపిస్తాయి.ఆమె మానవతావాది, స్నేహమయి,అనురాగమయి, ప్రకృతి ప్రేమికురాలు,కళాభిమాని, ఆపద్సమయాలలో అక్కున చేర్చుకునే నెచ్చెలి… ఆమే కోనసీమ లోని అంతర్వేదిపాలెంలో గోదారొడ్డున పల్లవించిన శ్రీమతి అల్లూరి (పెన్మెత్స) గౌరీ లక్ష్మి… వారికి మనహ్పూర్వక అభినందనలు… పుట్టి నాగలక్ష్మి.