గౌరీలక్ష్మి స్మితహితమృదుభాషిణి. తన అంతరంగంలోని మార్దవం,స్నేహశీలత ఆమె రచనల్లో ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తాయి.వ్యంగ్య, హాస్య ధోరణిలో ‘ సంచిక ‘ అంతర్జాల పత్రిక లో గౌరీలక్ష్మి, ప్రతి నెలా రాస్తున్న “రంగులహేల” కాలమ్స్ ఆలోచనాత్మకాలు.వీరి కలం నుండి ప్రయోజనాత్మక రచనలు ఇతోధికంగా వెలువడాలని మనః పూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.