అల్లూరి గౌరీలక్ష్మి మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకి వారసులు.ఐతే ఈమె విప్లవం విద్యారంగంలో చేశారు.ఆడపిల్లగా చదువుకునే అవకాశం ఇవ్వని సామాజిక వర్గం నుంచి వచ్చి పెద్ద చదువులు,పెద్ద ఉద్యోగాలతో కొత్త శకం మొదలు పెట్టారు.అక్కడితో ఆగక సాహిత్యంలో నవల,కథ,కాలమ్, కవిత్వాల ద్వారా సామాజిక రుగ్మతలను నలుగురికి ఎత్తి చూపుతూ ముందుకు సాగుతున్నారు.ఇంట గెలిచిన గౌరి పాఠకుల హృదయాలను గెలవడమే కాక మంచి స్నేహితుల హృదయాలను కూడా గెలిచిన స్నేహమయి.