“మలిసంజ కెంజాయ” నవలా రచయిత్రితో సంచిక.కామ్ మేగజైన్ ప్రత్యేక ఇంటర్వ్యూ..
శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారి ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని సమీక్షిస్తున్నారు శ్రీమతి గోటేటి లలితాశేఖర్…. click here more details
సహజ రచయిత్రి-అల్లూరి గౌరీలక్ష్మి
గౌరీలక్ష్మిగారు మూడు దశాబ్దాలుగా నిరంతరాయంగా సాహితీ సేవ చేస్తున్నారు. ఈమె నవలా,కథా రచయిత్రి, కవయిత్రి,కాలమిస్ట్ కూడా! ప్రభుత్వోద్యోగిగా, ANDHRA PRADESH INDUSTRIAL INFRASTRUCTION COPORATION LIMITED అనే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలో PUBLIC RELATIONS, GENERAL MANAGER గా పనిచేసి పదవీ విరమణ చేశారు “మానవ సంబంధాలు పూర్తిగా వాణిజ్యపరంగా మారిపోతున్న ఈ రోజుల్లో మనిషి గుండెను తట్టి నిద్రాణమైపోతున్న మానవతను మేల్కొల్పి తోటి మనిషిని మనిషిగా ప్రేమించమనీ.నిష్కల్మషంగా అర్థం చేసుకోమనీ ఉద్బోధించడానికి కథా సాహిత్యం దోహదపడుతుంది” అన్న సత్యాన్ని నమ్మి కథలు రాస్తున్నాను, అని చెప్పుకున్న గౌరీలక్ష్మి ప్రధానంగా కథా రచయిత్రిగా అనేక విలువైన కథలను రాశారు. కథలు: 90వ దశకంలో దాదాపు అన్ని వారపత్రికలూ సరసమైన కథలు ప్రచురిస్తున్న…
వంశీ- లేఖిని జాతీయ పురస్కారాలు – 30.1.2024 న మాదిరెడ్డి సులోచన పురస్కారం అందుకున్నారు.
33. సంభాషణం – శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి అంతరంగ ఆవిష్కరణ
33. సంభాషణం – శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి అంతరంగ ఆవిష్కరణ రచన: డా. ప్రసాద్ కె. ఎల్. వి. ఇతర రచనలు [సంచిక కోసం ప్రముఖ కవయిత్రి, కథా, నవలా రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.] కోనసీమ సాహితీ ఆణిముత్యం శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి కోనసీమ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది అక్కడి పచ్చని పంటపొలాలు, కొబ్బరి తోటలు, గోదావరీ, బంగాళాఖాతం. వీటికి తోడు ఎందరో విద్యావేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.లు వగైరా. అలాగే, రచయిత్రులు, రచయితలు, కవులు, కవయిత్రులు, చిత్రకారులూ, సినీ ప్రముఖులూను. ఇందులో, మా ప్రాంతానికి (రాజోలు, మల్కీపురం, సఖినేటిపల్లి, అంతర్వేది పాలెం) చెందిన…